కత్తి మహేశ్‌ అరెస్ట్..

కత్తి మహేశ్‌ అరెస్ట్..
x
Highlights

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల ఆయనపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని కేసు...

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల ఆయనపై
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ.. హిందూ దేవుడు రాముడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో బ్రాహ్మణ సంఘాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కత్తి మహేశ్‌ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories