Top
logo

కత్రినా కైఫ్ కు సున్నా మార్కులేశారట

కత్రినా కైఫ్ కు సున్నా మార్కులేశారట
X
Highlights

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఊపు తీసుకురావడంలో.. కత్రినా కైఫ్ చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి. చిక్ నీ చమేలీ.....

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఊపు తీసుకురావడంలో.. కత్రినా కైఫ్ చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి. చిక్ నీ చమేలీ.. షీలా కీ జవానీ లాంటి సాంగ్స్ ఇప్పటికీ టాప్ హిట్స్ గా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ ను అలా వినగానే.. ఇలా ఊపేస్తున్నాయి. తన డ్యాన్సింగ్ టాలెంట్ తో అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ కు.. ఓ కొరియోగ్రఫర్.. డ్యాన్స్ లో సున్నా మార్కులేశాడట.

ఆ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుని బాధ పడింది కత్రినా. సౌత్ లో ఓ ప్రముఖ హీరోతో కలిసి చేసిన సినిమా విషయంలో ఈ అనుభవం ఎదురైందట. వేరే వాళ్లతో మాట్లాడుతూ.. ఆ కొరియోగ్రఫర్.. కత్రినా కైఫ్ కు డ్యాన్స్ రాదనీ.. ఈ విషయంలో సున్నా మార్కులే వేస్తానని అన్నాడట. అయితే.. ఆ విషయం ఏదో తనతోనే చెబితే బాగుండేది కదా.. అని తనకు అనిపించి బాధపడ్డానని కైఫ్ చెప్పింది.

ఇంతకీ.. ఎవరా కొరియోగ్రఫర్ అంటే మాత్రం.. అలా పేరు చెప్పడం తప్పంటూ.. తప్పించుకుంది. ఇక్కడ క్లూస్ ఏంటంటే.. సౌత్ హీరో.. అందునా ప్రముఖ హీరో సినిమా. దక్షిణాది కొరియోగ్రాఫర్. ఈ రెండు విషయాల ఆధారంగా మీరెవరైనా ఆ పేరును కనక్కోవాలని అనిపిస్తే.. ట్రై చేయండి.

Next Story