logo
సినిమా

అటూ ఇటూ కాకపోతే అనవసరపు అనుమానాలు వస్తాయి: కత్తి

అటూ ఇటూ కాకపోతే అనవసరపు అనుమానాలు వస్తాయి: కత్తి
X
Highlights

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మరో సారి తనదైన శైలిలో...

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మరో సారి తనదైన శైలిలో స్పందించాడు. కొన్ని నెలలపాటు కత్తి మహేష్‌కు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య నడిచిన గొడవ చివరకు సద్దు మణిగింది. పవన్ అభిమానులు, మహేష్ పార్టీ చేసుకుని మరీ రాజీకి వచ్చారు. అప్పటి నుంచి మహేష్ రూటు మార్చారు. సాఫ్ట్‌గా తను అనుకున్నది చెప్పేస్తున్నారు. తాజాగా మహేష్ చేసిన ట్వీట్ పవన్‌ని ఉద్దేశించే అని అభిమానులు మండిపడుతున్నారు.

టీడీపీని పవన్ ప్రశ్నించకపోవడాన్ని తప్పు పడుతూ ఓ ట్వీట్ చేశారు. ‘‘తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉన్నాయన్నా, ప్రశ్నించను అని మొండికేస్తే ఎట్లాగబ్బా!? న్యూట్రల్‌గా ఉన్నాం అంటే న్యూట్రల్‌గా ఉండాలి. మిత్రపక్షం అయితే స్నేహధర్మం పాటించాలి. ఇలా అటూ ఇటూ కాకపోతే అనవసరపు అనుమానాలు వస్తాయి. సమర్థత, ధైర్యంపైన సందేహాలు వస్తాయి.’’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Next Story