సిగ్గు! సిగ్గు!!

సిగ్గు! సిగ్గు!!
x
Highlights

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నినిధులు కేటాయించింది అనే విష‌యంపై...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నినిధులు కేటాయించింది అనే విష‌యంపై ప‌వ‌న్ నిజ‌నిర్ధార‌ణ కోసం జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జె.ఎఫ్.సి) కమిటీని ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీ శుక్ర‌వారం భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించింది.
వారిలో అన్నీ రంగాల నుంచి హాజ‌రైన ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రోసారి భేటీ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ - లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ - సీనియర్ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ - లోక్ సభ మాజీ సభ్యులు కొణతాల రామకృష్ణ - సీపీఎం.ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు - సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ - కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలి మాజీ సభ్యులు గిడుగు రుద్రరాజు - పీసీసీ కార్యదర్శి జంగా గౌతమ్ - పూర్వపు శాసనమండలిలో సభ్యులైన ప్రొఫెసర్ నాగేశ్వర రావు - ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ క‌మిటీలోని స‌భ్యుల్ని టార్గెట్ చేస్తూ క‌త్తి విమ‌ర్శ‌లు చేశారు.
" ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి JAFFA కమిటీలో పని ఏమిటి చెప్మా!?!
JFF కమిటినా JAFFA కమిటినా? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు. రిలయన్స్ కంపెనీకి లాభాలు ఆర్జించి వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కు నష్టం కల్గించిన వాళ్ళు. హైదరాబాద్ రియల్ ఎస్టేటుల్లో ఏళ్ల తరబడి ఇల్లు హాండ్ ఓవర్ చెయ్యని వాళ్ళు. సిగ్గు! సిగ్గు!! " అంటూ ఇలాంటివారందరితో నిజనిర్ధారణ సంఘం వేయడం సిగ్గుచేటని మహేశ్ కత్తి విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories