logo
సినిమా

నీ కెరియ‌ర్ బాగుండాలి క‌త్తి..!

నీ కెరియ‌ర్ బాగుండాలి క‌త్తి..!
X
Highlights

క‌త్తిమ‌హేష్ కు -ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. త‌న‌పై కోడిగుడ్ల‌తో ...

క‌త్తిమ‌హేష్ కు -ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. త‌న‌పై కోడిగుడ్ల‌తో దాడిచేసినందుకు ప‌వ‌న్ అభిమానుల‌పై క‌త్తిమ‌హేష్ కేసు పెట్టారు. అయితే ఆ కేసును ఉప‌సంహ‌రించుకున్నట్లు, క‌త్తి - ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు క‌లిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
క‌త్తి మ‌హేష్ కేసును ఉప‌సంహ‌రించుకున్నార‌నే విష‌యం తెలుసుకున్న రైట‌ర్ కోన వెంక‌ట్ , క‌త్తిమ‌హేష్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు - మ‌హేష్ క‌త్తి ఫోటోలు క‌లిసి ఉన్న ఓ ఫోటోను కోన షేర్ చేశారు. నీ కెరియ‌ర్ బాగుండాలి. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని దూషిస్తే వారు పవన్‌కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అంటూ కామెంట్ చేశారు.
లైవ్ డిబెట్లో పాల్గొన్న అనంత‌రం క‌త్తి మ‌హేష్ మాదాపూర్ పీఎస్ లో పెట్టిన కేసును ఉప‌సంహ‌రించుకున్నారు. కత్తి మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం కానీ, కక్ష కానీ లేవని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప‌వ‌న్ - క‌త్తిల మ‌ధ్య వివాదం ముగిసిన‌ట్లే న‌ని టాలీవుడ్, అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
కాగా గ‌తంలో ప్రెస్ మీట్ లో క‌త్తి మ‌హేష్..పూన‌మ్ కౌర్, కోన వెంక‌ట్ , త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.ఈ ప్ర‌శ్న‌ల‌పై స్పందించిన కోన వెంక‌ట్ స‌యోధ్య కుదుర్చుతాన‌ని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై దయచేసి 15వ తారీఖు వరకు సైలెంట్ గా ఉండమని అన్నారు. మౌనం ఎప్పటికి మోసం చేయదు అన్న కొటేషన్ తో పాటు కత్తి మహేష్ తో పాటుగా అభిమానులు మౌనం వహించాలని కోరుకున్నారు. ముఖ్యంగా కత్తి మహేష్ కూడా ఏ మీడియా హౌజ్ కు వెళ్లి అభిమానులను, పవన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ట్వీట్ చేశారు. అలా చేస్తే సయోధ్య కుదుర్చాలన్న తన ప్రయత్నం ఫలించినట్టే అని అన్నారు.
15త‌రువాత ఏం జ‌రుగుతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఈనేప‌ధ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులపై క‌త్తి మ‌హేష్ పెట్టిన కేసును వెన‌క్కి తీసుకోవ‌డంతో కోన వెంక‌ట్ - క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య వివాదం ముగిసింది.

Next Story