logo
సినిమా

రైతుగా "చినబాబు"!

రైతుగా "చినబాబు"!
X
Highlights

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో వస్తున్న...

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా "చినబాబు".
తమిళనాట 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తమ్ముడు కార్తీ హీరోగా రూపొందిస్తున్న "కుట్టి సింగం"ను తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై "చినబాబు"గా రూపొందిస్తున్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. కార్తీ సరసన సయేషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, భానుప్రియలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ""సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకి నాయక" లాంటి సూపర్ హిట్స్ అనంతరం కార్తీ హీరోగా తెరకెక్కిన "చినబాబు" తెలుగు రైట్స్ ను సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తమిళంలో ఈ చిత్రాన్ని సూర్య తన స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. తెలుగు వెర్షన్ రైట్స్ ను మాకు ఇచ్చినందుకు సూర్యగారికి నా కృతజ్ఞతలు. కార్తీ ఈ చిత్రంలో రైతుగా కనిపించనున్నాడు. మే 1న కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని "చినబాబు" కొత్త పోస్టర్ ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ఆడియో లాంచ్ మరియు రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేస్తాం " అన్నారు.

Next Story