కరుణానిధి చనిపోయినట్లు రెండో భార్యకు తెలియదు!

తన భాగస్వామి తిరుగురాని లోకాలకు చేరుకున్న విషయం, ఆ జీవనసహచరికి తెలియదు. కళ్లముందే భర్త ఆఖరి మజిలీ...
తన భాగస్వామి తిరుగురాని లోకాలకు చేరుకున్న విషయం, ఆ జీవనసహచరికి తెలియదు. కళ్లముందే భర్త ఆఖరి మజిలీ మొదలవుతున్నా.. ఏమాత్రం గుర్తించలేని స్థితి ఆమెది. డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత, తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కు తెలియదు. 2016 నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. కరుణ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు అళగిరి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి కరుణ వద్ద కొంతసేపు వుంచి ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం గోపాలపురంలోని ఇంటికి కరుణ పార్థివదేహాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నప్పటికీ.. ఏం జరిగిందో గ్రహించే స్థితిలో లేరు. అందుకే.. మెరీనాబీచ్‌లో జరిగిన కరుణ అంత్యక్రియలకు దయాళు అమ్మాళ్‌ను తీసుకురాలేదు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
11 Aug 2022 3:19 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMT