సంధ్య తన కొలీగ్‌తో క్లోజ్‌గా ఉండడం నచ్చలేదు : కార్తీక్

సంధ్య తన కొలీగ్‌తో క్లోజ్‌గా ఉండడం నచ్చలేదు : కార్తీక్
x
Highlights

ఇక సంధ్య చావుకు కారణమైన కార్తీక్‌‌పై పోలీసులు 307, 354 D సెక్షన్ల కింద కేసు పెట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల...

ఇక సంధ్య చావుకు కారణమైన కార్తీక్‌‌పై పోలీసులు 307, 354 D సెక్షన్ల కింద కేసు పెట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల విచారణలో కార్తీక్ పలు విషయాలు చెప్పాడు. తనది వన్ సైడ్ లవ్వేనని ఒప్పుకున్నాడు. మూడేళ్ళుగా సంధ్యతో పరిచయం ఉందన్న కార్తీక్..ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించానని తెలిపాడు. అయితే తన ప్రేమను సంధ్య అంగీకరించలేదని వివరించాడు. ఇటీవల సంధ్యారాణికి ఫోన్ చేస్తే సంధ్య కొలీగ్ మాట్లాడాడనీ..ఆమె జోలికి రావొద్దని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. సంధ్య తన కొలీగ్‌తో క్లోజ్ ఉండడం సహించలేకపోయాననీ పైగా తనను దూరం పెట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని అంగీకరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories