కన్నడ ముస్లింలు... కిరీటం పెట్టేదెవరికి?

కన్నడ ముస్లింలు... కిరీటం పెట్టేదెవరికి?
x
Highlights

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బీజేపీకి మాతృసంస్థ ఆరెస్సెస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు మించి రాబోవని తేల్చి...

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బీజేపీకి మాతృసంస్థ ఆరెస్సెస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు మించి రాబోవని తేల్చి చెప్పింది. అంతర్గత సర్వే వివరాలను దక్షిణ భారత ప్రాంతీయ విభాగ్‌... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు అందించినట్లు సమాచారం. మరిప్పుడు కమలం ఏం చేయబోతోంది? సర్వే సత్యాలు నిజమవుతాయని అంచనా వేస్తుందా? అసలు ముస్లింల ఓట్లు కన్నడ నాట ఎవరికి పడనున్నాయి? కర్ణాటక ఎన్నికలలో కూడా బీజేపీ ముస్లింలతో టచ్-దెమ్-నాట్ విధానాన్ని అవలంబిస్తోంది. దీంతో అక్కడ ముస్లింలకు కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. పరిస్థితులను బట్టి చూస్తే, ముస్లింలు చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోందంటున్నాయి సర్వేలు. అయితే విశ్వసనీయత కలిగిన జేడీఎస్ అభ్యర్థి కనుక బరిలో నిలబడితే, కులమతాలతో పట్టింపు లేకుండా ముస్లింలు వారికే ఓటు వేసే అవకాశం కూడా ఉంది. ఆ ప్రత్యామ్నాయం కూడా కేవలం దక్షిణ కర్ణాటక జిల్లాలలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోటీ ఉన్న చోట మాత్రమే. కానీ ఉత్తర, కోస్తా, మధ్య కర్ణాటక జిల్లాలు - అంటే సుమారు 150 నియోజకవర్గాలలో ముస్లింలకు ఉన్న ప్రత్యామ్నాయం చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ దాదాపు జేడీఎస్ లేనే లేదని చెప్పొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే..... బీజేపీ 70 లేదా ఆ లోపు సీట్లతోనే సరిపెట్టుకుంటుంది, కాంగ్రెస్‌కు 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్‌ 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. జీఎస్టీ ఎఫెక్ట్‌, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్య, తీవ్ర ప్రభావం చూపటంతో బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో తెలిపింది. ఇవిగాక రాజకీయ విశ్లేషణలో భాగంగా.. దళిత ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ దారుణంగా విఫలమైందని.. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్‌ కులస్తులపై పట్టుతప్పిందని, అన్నింటికి మించి గాలి జనార్దన్‌ అనుచరులకు పెద్దపీట వేయటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లిందని నివేదికలో పేర్కొంది. అయితే ఈ సర్వే నివేదిక విషయాన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఆరెస్సెస్‌ సర్వేలు అత్యంత గోప్యంగా ఉంటాయని, అలాంటప్పుడు ఈ నివేదికను ఎలా నమ్ముతారంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ అవకాశాలను దెబ్బ తీసేందుకే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఆ నివేదిక సంగతి పక్కపెడితే ఇప్పటిదాకా వెలువడ్డ పలు సర్వే నివేదికలు మాత్రం స్పష్టమైన మెజార్టీ బీజేపీకి దక్కవనే తేల్చాయి. దీంతో బీజేపీలో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories