సిద్ద రామయ్యకు ఇలా జరిగిందేంటి..!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రస్తుతం రాజకీయంగా ఎదురీదుతున్నారు. 2013 లో బీజేపీలో కుమ్ములాట వలన ...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రస్తుతం రాజకీయంగా ఎదురీదుతున్నారు. 2013 లో బీజేపీలో కుమ్ములాట వలన ఎన్నికల్లో లబ్దిపొందిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధిక జనాభా గల సామజిక వర్గం (కురుబ) నుంచి ప్రముకంగా కనబడ్డారు సిద్దరామయ్య. గడిచిన గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని సిద్దరామయ్య ఈ ఎన్నికల్లో 100 కు పైగా సీట్ల ను సాధించి బీజేపీ జైత్ర యాత్రను అడ్డుకుంటారనుకుంటే కనీస(70) సీట్లను సాధించకపోవడం ఏంటనే అంతర్మధనం కాంగ్రెస్ లో మొదలయింది.. దీనికి అంతటికి పార్టీలోని గ్రూపు తగాదాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అందరిని కలుపుకొని కారణంగానే ఈ పరాజయం అని పార్టీలోని సిద్దు వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం లేదని, పైగా కొన్ని చోట్ల కాంగ్రెసేతర నేతలకు ప్రాధాన్యత కల్పించారని సిద్ధుపై మండిపడుతున్నారు. ఇవన్నీ కారణాలతో అధికారం లోకి రావాల్సిన పార్టీ చతికిలపడిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక సీఎం సిద్దరామయ్య పోటీ విషయానికొస్తే బాదామిలో 160 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. చాముండేశ్వరి నియోజకవర్గంలోనూ సీఎం సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన 13వేల ఓట్లతో వెనుకబడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే వెనుకంజలో ఉంటే మిగతా నాయకుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఆ పార్టీలో తలెత్తుతుంది. దీనిపై పునరాలోచించుకుని సంవత్సరంలోపు వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT