శ్మశానంలో పెళ్ళిరోజు జరుపుకున్నారు.. ఎందుకో తెలుసా ?

దయ్యాల్లేవు, భూతాల్లేవు, అదంతా ఒట్టి రూమర్ అని నిరూపించడానికి ఓ జంట తమ పెళ్ళిరోజును శ్మశానంలో జరుపుకుని...
దయ్యాల్లేవు, భూతాల్లేవు, అదంతా ఒట్టి రూమర్ అని నిరూపించడానికి ఓ జంట తమ పెళ్ళిరోజును శ్మశానంలో జరుపుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే..కర్నాటకలోని కల్‌బుర్గి జిల్లాలో మూఢ నమ్మకాలను దూరం చేసేందుకు ఆ దంపతులు వినూత్న ప్రయోగం చేశారు. వీరు తమ 18 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను శ్మశానంలో చేసుకున్నారు. కల్‌బుర్గిలోని శివారు గ్రామమైన నందీకుర్‌కు చెందిన పవన్ కుమార్, అనితల విచిత్ర వివాహ వార్షికోత్సవానికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వేడుకలకు గుర్తుగా వారు మొక్కలను కూడా నాటారు. అనిత జిల్లా పంచాయతీ అధ్యక్షులిగా పనిచేశారు. ఆమె భర్త వవన్ కుమార్ సామాజిక కార్యకర్త. వీరు ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే వీరు శ్మశానాన్ని శుభ్రపరిచి అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ‘మొదట్లో వేడుకలకు వచ్చేందుకు కొంతమంది నిరాకరించగా, వారికి అవగాహన కల్పించడంతో హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం కూడా చేశారని’ పేర్కొన్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT