logo
సినిమా

క్యాబ్ డ్రైవ‌ర్ గా ప్ర‌ఖ్యాత న‌టుడు

క్యాబ్ డ్రైవ‌ర్ గా ప్ర‌ఖ్యాత న‌టుడు
X
Highlights

61సినిమాల్లో న‌టించి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న న‌టుడు. తండ్రి వార‌స‌త్వంగా తెరంగ్రేంటం చేసినా త‌న‌కంటూ...

61సినిమాల్లో న‌టించి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న న‌టుడు. తండ్రి వార‌స‌త్వంగా తెరంగ్రేంటం చేసినా త‌న‌కంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం చేతిలో అవ‌కాశాలు లేక గ‌త 8నెల‌లుగా క్యాబ్ డ్రైవ‌ర్ గా మారిపోయాడు. ఆత్మాభిమానం ఎక్కువ కావ‌డంతో అవకాశం ఇవ్వాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని చేయిచాచిందిలేదు. దీంతో త‌న‌పేరు, హోదా గురించి ప‌ట్టించుకోకుండా క్యాబ్ న‌డుపుకుంటూ స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌దంగా జీవిస్తున్నాడు. అవ‌కాశం వ‌స్తే బుల్లితెర‌, వెండితెర‌పై యాక్ట్ చేస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు. కన్న‌డ‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన దివంగత కేఎస్ అశ్వత్ కొడుకు శంక‌ర్ అశ్వ‌త్ (60) జీవ‌నోపాధి కోసం బెంగ‌ళూరులో ఊబ‌ర్ క్యాబ్ డ్రైవ‌ర్ గా జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. తండ్రి వార‌స‌త్వంగా సినిమాల్లోకి అడుగుబెట్టి 25ఏళ్ల‌పాటు సినీరంగానికి సేవ‌లందించారు. అయితే గ‌త‌కొద్దికాలంగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కుంగిపోకుండా డ్రైవ‌ర్ అవ‌తారం ఎత్తారు. డ్రైవ‌ర్ గా త‌న జీవితం బాగుంద‌ని సోమవారం నుంచి గురువారం వరకు క్యాబ్‌లో మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. అంతేకాదు సినిమాల్లో యాక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చినా క్యాబ్ డ్రైవ‌ర్ గా కొన‌సాగుతాన‌ని ఇది తనకు భవిష్యత్తులో అవసరమయ్యే నగదును అందజేస్తుందని చెప్పారు.

Next Story