వారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : కన్నా సంచలనం..

వారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : కన్నా సంచలనం..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ఏపీప్రభుత్వం కనుసన్నలలోనే ఈ తతంగం...

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ఏపీప్రభుత్వం కనుసన్నలలోనే ఈ తతంగం జరుగుతుందని అయన కేంద్ర హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. 'ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏ విధంగా దొరికిపోయారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టెక్నాలజీని చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు. పోలీసులు ద్వారా నా ఫోన్లను ట్యాప్‌ చేయిస్తున్నారు' అని కన్నా ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం కన్నా లక్ష్మినారాయణ ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories