పది రోజుల్లోగా రైతు రుణాల మాఫీ: సీఎం

పది రోజుల్లోగా రైతు రుణాల మాఫీ: సీఎం
x
Highlights

ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే, కాగా ప్రచారభాగంలో రాహుల్...

ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే, కాగా ప్రచారభాగంలో రాహుల్ గాంధీ చేసిన రైతు రుణాల మాఫీ హామీని కేవలం పదిరోజుల్లోనే అమలు చేయనున్నట్లు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన భూపేష్ బాగెల్ ప్రకటించారు. కాగా తాజాగా మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు మధ్యప్రదేశ్ రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తూ తొలిసంతకం చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లాగానే బాఘెల్ సైతం ఇచ్చిన హామీ మేరకు 10 రోజుల్లోగా రైతు రుణాలను మాఫీ, క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.1700 నుంచి రూ.2.500కు పెంచేందుకు ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో భూపేష్ బాగెల్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories