జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?

జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?
x
Highlights

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్...

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్ దిలీప్ జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్తే కాకుండా ప‌వ‌న్ అభిమానం సంఘం నాయ‌కుడు కూడా.
ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప్ర‌త్యర్ధులు విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు చ‌ర్చాకార్య‌క్ర‌మాల్లో జ‌న‌సేన త‌రుపున వాయిస్ వినిపించి ఎప్ప‌టిక‌ప్పుడు వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.సోష‌ల్ మీడియాలో, పార్టీ కార్య‌క్ర‌మాల్లో త‌నదైన పాత్ర పోషించే క‌ల్యాన్ దిలీప్ రీసెంట్ గా క‌త్తిమ‌హేష్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ వివాదంలో ప‌వ‌న్ కు వెన్నుద‌న్నుగా నిలిచారు. క‌త్తిమ‌హేష్ చేసే విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టారు.
ఈ నేప‌థ్యంలో కల్యాణ్ దిలీప్ జ‌న‌సేనకు వీడ్కోలు ప‌లికిన‌ట్లు స‌మాచారం. పార్టీకి నిరంత‌రాయంగా ప‌నిచేస్తున్నా త‌న‌కు స‌రైన మ‌ద్ద‌తు లేదంటూ వాపోతున్నకల్యాణ్ దిలీప్ సుంకర పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దాన్ని మహేష్ కత్తి స్క్రీన్ షాట్ తీసి
వ్యక్తి మీద అభిమానంతో, పార్టీ మీద ప్రేమతో అహర్నిశలూ ఆలోచించి, శ్రమపడి, పాటుపడిన ఒక సామాన్యుడికి దక్కేది అవమానం. అంతకన్నా ఏమీ లేదు. జనసేన పార్టీ ఫ్యాన్స్ క్లబ్ కి ఎక్కువ తోకపార్టీకి తక్కువ. ఇప్పటికైనా ఆలోచించుకొండి మిత్రులారా..! అంటూ ట్విట్టర్‌లో తన వ్యాఖ్యను జోడించారు. అయితే, ఆ ఫేస్‌బుక్ ఖాతా కల్యాణ్ దిలీప్ సుంకరది కాదనే వాదన కూడా ఉంది. మహేష్ కత్తి అనవసరంగా ఇటువంటివి సృష్టిస్తున్నారని కూడా అంటున్నారు. కల్యాణ్ దిలీప్ సుంకర అధికార ఫేస్‌బుక్ పేజీలో మాత్రం పార్టీకి సంబంధించిన పోస్టులు కనిపంచడం లేదు. ఇదంతా ఫొటో షాప్ మహిమ అంటూ వవన్ కల్యాణ్ అభిమానులు కొందరు కొట్టిపారేస్తున్నారు. కల్యాణ్ దిలీప్ ఖాతాలో చివరి పోస్టు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories