ప్రాణభయంతో కొందరి పేర్లు బయటపెట్టలేదు : వర్మ

ప్రాణభయంతో కొందరి పేర్లు బయటపెట్టలేదు : వర్మ
x
Highlights

వివాదాలకి మారు పేరు సంచలనాలకి కేరాఫ్ అయిన రాంగోపాల్‌వర్మ గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్నాడు. అయితే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ గతవారం సోషల్...

వివాదాలకి మారు పేరు సంచలనాలకి కేరాఫ్ అయిన రాంగోపాల్‌వర్మ గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్నాడు. అయితే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ గతవారం సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్‌ పెట్టాడు. కడప-రాయలసీమ రెడ్ల చరిత్ర వెబ్‌ సిరీస్‌ వెనుక నా సద్బుద్దితో కూడిన దుర్బుద్దికరమైన సద్దుదేశ్యం ఉందన్నాడు. తాను తీస్తున్న మొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్‌ సిరీస్‌ కడప అంటూ చెప్పుకొచ్చాడు. నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం అని ఆయన ఆ పోస్ట్ ద్వారా వివరించాడు.

అనుకున్నట్టే నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేసాడు అందులో ముఖ్యంగా రెడ్ల పౌరుషం వారి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి ఉన్నట్టు తెలుస్తుంది.. అంతేకాదు ఈ సినిమాలోని కొన్ని పాత్రలు ప్రాణభయంతో పేర్లు బయటికి రావు అని చెప్పి వణికిపోయే ఫ్యాక్షన్ గొడవల్ని చిత్రీకరించాడు.. వర్మ

ఈ ట్రైలర్ లో ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తండ్రి రాజారెడ్డి మాజీ మంత్రులు బాంబుల శివారెడ్డి, పరిటాల రవిల ఫ్యాక్షన్ రహస్యాలు కూడా ఉన్నట్టు స్పష్టంగా అర్ధమవుండటం చెప్పుకోదగ్గ విషయం..

కాగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ‘కడప’. హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజానికి కేరాఫ్ అడ్రస్‌ కడప అని వర్మ తెలిపాడు.

ఒక ప్రాంతం స్ఫూర్తిగా కడప అన్న టైటిల్‌ పుట్టిందన్న వర్మ. రక్తచరిత్ర తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, ఫ్యాక్షన్‌ బాధితులు, వాళ్ల ఇళ్లలో పనిచేసే వారి నుంచి లాగేసిన మెటిరియల్ అన్నారు వర్మ. రక్తచరిత్రలో డీల్ చేసిన సబ్జెక్ట్ కేవలం 5శాతం మాత్రమేనన్న వర్మ అందులో కొన్ని నిజాలే చూపించానన్నారు.ఇక ఈ కడప రెడ్డి ఫ్యాక్షన్ ని పూర్తిస్థాయిలో భయపడకుండా తీసిన స్టోరీ అన్నారు.. అలాగే ప్రత్యర్థి వర్గాల్ని క్రూరంగా ఎలా మట్టుబెట్టారో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలుస్తుందన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories