logo
సినిమా

రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!

రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!
X
Highlights

మొదట మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న రజినీకాంత్ 'కాలా' ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ...

మొదట మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న రజినీకాంత్ 'కాలా' ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే ‘కాలా’ వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ మేరకు ట్రేడ్ ఎనలిస్టు రమేశ్ బాల ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టిందని అయన అన్నారు. ఇక అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ఫస్ట్ వీకెండ్‌లో మిలియన్‌ మార్క్‌ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది.చెన్నైలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో రూ. 4.9 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Next Story