logo
జాతీయం

ఇరకాటంలో సల్మాన్ బెయిల్ అంశం

ఇరకాటంలో సల్మాన్ బెయిల్ అంశం
X
Highlights

సల్మాన్ ఖాన్ బెయిల్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సల్మాన్‌కు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది...

సల్మాన్ ఖాన్ బెయిల్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సల్మాన్‌కు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది తేలాల్సి ఉండగా.. జోధ్‌పూర్ కోర్టు న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి.. ప్రమోషన్ పై హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. దీంతో రిజర్వ్‌లో ఉన్న బెయిల్ తీర్పు ఇప్పుడప్పుడే వెలువడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతంలోనే రవీంద్రకుమార్ జోషికి ప్రమోషన్ రాగా.. గత రాత్రి ఆయన బదిలీ అయ్యారు. రాజస్థాన్‌లో మొత్తం 87 మంది జడ్జీలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఈ క్రమంలో రవీంద్రకుమార్ జోషీ కూడా బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో సల్మాన్ బెయిల్ అంశం ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో బాయిజాన్ మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని.. తెలుస్తోంది.

Next Story