logo
సినిమా

ఎన్టీఆర్‌ అభిమానుల‌కు చేదు వార్త‌!

ఎన్టీఆర్‌ అభిమానుల‌కు చేదు వార్త‌!
X
Highlights

జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో వచ్చిన బిగ్‌బాస్‌ షో ఎంత హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై...

జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో వచ్చిన బిగ్‌బాస్‌ షో ఎంత హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై తిరుగులేని టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులు సృష్టించింది. అది కూడా ఎలా అంటే తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో సూపర్‌ హిట్‌ అయింది. ఇదే ఉత్సాహంతో రెండో సీజన్‌ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్‌బాస్‌ షో తర్వాతి సీజన్‌పై టాలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌ అయింది. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అలరించిన తారక్‌ను మళ్లీ బిగ్‌బాస్‌ షోలో చూసే అవకాశం లేదనే వార్త టాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

`జైల‌వ‌కుశ‌` సినిమా త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోయే సినిమా కోసం స‌న్న‌ద్ధం అవుతున్నాడు. ఆ సినిమాలో ఎన్టీయార్ సిక్స్ ప్యాక్‌తో క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీయార్.. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ మల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో `బిగ్‌బాస్‌` షో చేయ‌డానికి ఎన్టీయార్‌కు స‌మ‌యం లేదు. తాజాగా ఈ సీజ‌న్‌ కోసం ఎన్టీయార్‌ను నిర్వాహ‌కులు సంప్ర‌దించార‌ట‌. అయితే ఇప్ప‌టికే అంగీక‌రించిన‌ సినిమాలు, ఫ్యామిలీ క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఈ కార్య‌క్ర‌మం చేయ‌లేనని ఎన్టీయార్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Next Story