logo
జాతీయం

టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫర్లే.. ఆఫర్లు..

టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫర్లే.. ఆఫర్లు..
X
Highlights

జియో గిగాఫైబర్ సర్వీస్ ప్రారంభానికి ముందే టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు 12 నగరాల్లో తన సేవలు ప్రారంభించింది....

జియో గిగాఫైబర్ సర్వీస్ ప్రారంభానికి ముందే టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు 12 నగరాల్లో తన సేవలు ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, ఘాజియాబాద్, గుర్గావ్, నోయిడా, పూణె, భోపాల్, చెన్నయ్, బెంగుళూరు, అహ్మదాబాద్, మీరా భాయందర్ లలో టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు.. వినిగదారులు ఉంటున్న ఏరియాల్లో కావాలనుకుంటే కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోని ఆన్ లైన్ ఫామ్ నింపితే సేవల లభ్యత వివరాలు తెలుస్తాయి. దాని ప్రకారం టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ డేటా ప్యాకేజి లు 1,3,5,9,12 నెలలుగా ఉంటే..ఆఫర్లు ఇలా ఉన్నాయి.. రూ.999కి 5ఎంబీపీఎస్ స్పీడ్, అలాగే రూ.1,150కు 10 ఎంబీపీఎస్, రూ.1,500 కి 30ఎంబీపీఎస్, రూ.1,800కు 50ఎంబీపీఎస్, రూ.2,500కి 100 ఎంబీపీఎస్, ఇవి కాకుండా నెలకు 60జీబీ డేటా ప్లాన్ రూ.999కి, 125జీబీ డేటా ప్లాన్ రూ.1,250కి లభ్యమవుతాయి. అయితే వీటిలో అన్ లిమిటెడ్ డేటా రానుంది. మొదట ఇన్ స్టాలేషన్ ఛార్జీ కింద రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వైఫై రూటర్ ఉచితంగా లభించనుంది.

Next Story