జియో మరో బంపర్‌ ఆఫర్‌...వారికి పండగే

జియో మరో బంపర్‌ ఆఫర్‌...వారికి పండగే
x
Highlights

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్‌ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ...

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్‌ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రూ. 101 రీచార్జి చేసుకుంటే 4జీ స్మార్ట్‌ఫోన్లకు 4 రోజులపాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చని జియో ప్రకటించింది. ఈ కాంప్లిమెంటరీ ఆఫర్‌ ఎంపిక చేసిన జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి కాలింగ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను జియో అందించడం లేదు. కేవలం డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. మై జియో యాప్‌ను ఓపెన్‌ చేసుకుని మై ప్లాన్స్‌ సెక్షన్‌లో మీకు ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్‌ మీకు అందుబాటులో ఉంటే, రూ.101తో ఈ ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది. రోజులో ఆఫర్‌ చేసే లిమిట్‌ అయిపోతే, 64కేబీపీఎస్‌ స్పీడులో ఈ అపరిమిత యాక్సస్‌ను పొందవచ్చు. ఈ డేటా ద్వారా యూజర్లు క్రికెట్ మ్యాచ్ లైవ్ వీడియోని ఆస్వాదించవచ్చు. క్రికెట్‌ ప్యాక్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌, బ్రౌజింగ్‌, స్ట్రీమింగ్‌, డౌన్‌లోడింగ్‌ కోసం కూడా వాడుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories