దుశ్శాసన పర్వం కాదు...వైసీపీ నేతల కుట్ర

X
Highlights
జెర్రిపోతులపాలెంలో మహిళల మధ్య గొడవను వైసీపీ వేరే విధంగా చిత్రీకరించిందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు...
lakshman21 Dec 2017 1:26 PM GMT
జెర్రిపోతులపాలెంలో మహిళల మధ్య గొడవను వైసీపీ వేరే విధంగా చిత్రీకరించిందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పడిపోయిన మహిళను లేపుతోన్న వ్యక్తులను చూపుతూ కీచక పర్వం అంటూ అభూత కల్పనలు సృష్టించారన్నారు. ఇందులో టీడీపీ కార్యకర్తల తప్పు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండారు సత్యనారాయణమూర్తి సవాల్ విసిరారు. విబేధాలు సృష్టించడం వైసీపీ నైజమని... దళితులు, బీసీల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story