సీఎం రమేష్ ఉక్కు దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

x
Highlights

కడప సీఎం రమేష్ ఉక్కు దీక్షలో.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దీక్షల వల్ల.. స్టీల్ ప్లాంటు రాను గాక రాదని కుండబద్దలు...

కడప సీఎం రమేష్ ఉక్కు దీక్షలో.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దీక్షల వల్ల.. స్టీల్ ప్లాంటు రాను గాక రాదని కుండబద్దలు కొట్టారు. సీఎం రమేష్.. దీక్ష చేసినంత మాత్రాన ఉక్కు రాదు.. తుక్కు రాదు అన్నారు. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి.

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఒక వర్గాన్ని హత్యలు చేసిన మోడీకి.. ప్రధానిగా ఉండటానికి అర్హత లేదన్నారు జేసీ. సీఎం చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దన్నారు జేసీ. ఆయనకు అన్ని కుయుక్తులు తెలుసని చెప్పారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాబట్టే.. ఏపీకి ఏదైనా చేస్తే.. తమను లెక్క చేయరనే.. మోడీ ఏమీ చేయడం లేదని చెప్పారు. ప్రధాని మోడీ ఏపీకి ఏమీ చేయరని.. మూడున్నరేళ్ల కిందటే సీఎంకు చెప్పానన్నారు. అప్పుడు బాబు.. నీకు తెలియదులే దివాకర్ అన్నారని చెప్పారు. కానీ.. ఇప్పుడు బీజేపీ వాళ్లు జగన్ తమవాడు అంటున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories