ఇక సీఎం పదవి చాలు, ఇకపై

x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం.చాలామంది కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక్క ముక్కలో తేల్చేశారు. రేపటి రోజున లోకేశ్‌ సీఎం అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా? టీడీపీ అనేది చంద్రబాబు సొంతం.. ఆయన కొడుకుకి సీఎం పదవి ఎందుకు ఇవ్వకూడదు? ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వరా? చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు? అని వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేకహోదా రాదని తేల్చేశారు. మంగళవారం విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయని జేసీ అన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారని చెప్పారు. చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్‌ పెట్టుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూ స్థాపితం అయిందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories