జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం...త్వరలోనే...

జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం...త్వరలోనే...
x
Highlights

ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని...

ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన తనయుడు పవన్‌రెడ్డి నిలబడతారనే ప్రచారం పాకిపోయింది. ఈ విషయంలో ఎంపీ జేసీ కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్విడ్జర్లాండు, జెనీవాలో ఎంబీఏ చదువుకున్న ఆయన హైదరాబాద్‌లో ఉంటూ సినిమా ప్రముఖులు, క్రికెటర్లతో ఆయన పరిచయాలు పెంచుకుంటున్నారు. కొంతకాలంగా అనంతపురంపై దృష్టి సారించారు. నగరంలోని ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండేళ్ల నుంచి ముస్లింలకు దగ్గరవుతూ రంజాన్‌ సమయాల్లో భారీగా ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఆయన అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులతో చర్చిస్తూ స్థానికంగా సహకారం కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories