జేసీకి ఎదురుపడిన సోనియా.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

జేసీకి ఎదురుపడిన సోనియా.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
x
Highlights

పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు. ఈ సందర్భంలో...

పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు. ఈ సందర్భంలో జేసీ సోనియాతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు’’ అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు. జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories