ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాదు..ఆ విష‌యం ప‌వ‌న్ కి తెలుసు

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాదు..ఆ విష‌యం ప‌వ‌న్ కి తెలుసు
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ జేఎఫ్ సీ ఏర్పాటు...

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ జేఎఫ్ సీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే క‌మిటీ ఏర్పాటు చేసిన ప్రారంభంలో చురుగ్గా ఉన్న ప‌వ‌న్ ఆ త‌రువాత శ్ర‌ద్ధ చూపించ‌డం లేద‌ని ఆరోపించారు. నిధుల విష‌యంలో నానా హ‌డావిడి చేసిన జ‌సేనాని ఆ విష‌యం మ‌రిచిపోయి సైలెంట్ గా ఎందుకు ఉన్నారని ప్ర‌శ్నించారు.
అయితే ప‌వ‌న్ తీరు న‌చ్చ‌క జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ స్వ‌తంత్ర నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి ఎన్నినిధులు కేటాయించింది అనే విష‌యం పై ప‌వ‌న్ జేఏఎఫ్ సీ ని ఏర్పాటు చేశారు. నిధుల విష‌యంలో ఓ నివేదిక‌ను విడుద‌ల చేస్తుంది. కానీ దాని గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఆందోన వ్య‌క్తం చేశారు.
అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అన్నారు. తాము చర్చించడానికి కేంద్రం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తేల్చేందుకు జేఎఫ్‌సీ ఏర్పాటయిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం పాటు అన్ని లెక్కలు తీసి మీడియా ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత పవన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అంతేకాదు ఈ సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా గురించి మాట్లాడిన జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాదాని ఏపీలో ఉన్న అన్నీ రాజ‌కీయ పార్టీల‌కు తెలుసున‌ని బాంబు పేల్చారు. పేరు ఏదైనా కావొచ్చు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం రావాలన్నారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినప్పటికీ నిధులు వచ్చి, ఏపీ అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.
కేంద్రం ఏం చేసిందో తెలుసుకునేందుకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టపరంగా, పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం ఏ మేరకు హామీలు నెరవేర్చిందో తేల్చడం కోసం జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories