logo

పవన్‌ కోరితే టీడీపీకి రాజీనామా చేయిస్తా: జనసేన నేత

పవన్‌ కోరితే టీడీపీకి రాజీనామా చేయిస్తా: జనసేన నేత

తాను జనసేనలో ఉన్నానని, తన భార్య మాత్రం టీడీపీ తరఫున గెలిచి జడ్పీటీసీ పదవిలో ఉందని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేత బర్రె జయరాజు, పవన్ కోరితే తన భార్యను టీడీపీ నుంచి రాజీనామా చేయించేందుకు సిద్ధమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు సైతం చెప్పానని ఆయన మీడియాతో అన్నారు. బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌ ఇస్తే తాను జనసేన తరుపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జనసేన అధినేత ఎవరికి అవకాశం కల్పించినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. టిక్కెట్‌ ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పవన్‌ సిద్ధాంతాలు, అభిమానం మీద ఆ పార్టీలో చేరానన్నారు. ఆయన ఆదేశించిన క్షణంలో నా భార్య వెంటక రమణ చేత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తానని విలేకర్లకు చెప్పారు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top