జనసేన ప్రధాన కార్యదర్శిని ప్రకటించిన పవన్

జనసేన ప్రధాన కార్యదర్శిని ప్రకటించిన పవన్
x
Highlights

పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగతంపై...

పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగతంపై దృష్టిసారించారు. అందులోభాగంగా అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శిలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నోవా ఇంజనీరింగ్ కళాశాల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావును పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నియమించారు. ఈ మేరకు ఏలూరులో పవన్‌ వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడలోని కృష్ణారావు నివాసాన్నే జనసేన ఏపీ కార్యాలయంగా వినియోగించుకుంటోంది ఆ పార్టీ.

Show Full Article
Print Article
Next Story
More Stories