logo
సినిమా

'జై ల‌వ‌కుశ'@ రూ.100 కోట్లు

జై ల‌వ‌కుశ@ రూ.100 కోట్లు
X
Highlights

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గురువారం ...

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గురువారం విడుద‌లైన ఈ సినిమా నేటితో రూ.100 కోట్ల గ్రాస్‌ని క్రాస్ చేసింది. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది.

Next Story