logo
సినిమా

2400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ‌'

2400 థియేట‌ర్స్‌లో జై ల‌వ కుశ‌
X
Highlights

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ కుశ‌'. కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు తార‌క్‌. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి 'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 2,400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ'ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇదే కావ‌డం విశేషం. రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. 'స్వింగ్ జ‌రా' అంటూ సాగే ప్ర‌త్యేక గీతంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మెర‌వనుందీ చిత్రంలో.

Next Story