నాలుగేళ్లలో టీడీపీ చేసిందేమీ లేదు..కానీ మేము అన్నీ చేస్తాం

నాలుగేళ్లలో టీడీపీ చేసిందేమీ లేదు..కానీ మేము అన్నీ చేస్తాం
x
Highlights

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, బుక్కపట్నం మండలంలో వైఎస్‌ జగన్‌ యాత్ర కొనసాగింది. కృష్ణాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర... పాముదుర్తి వరకు...

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, బుక్కపట్నం మండలంలో వైఎస్‌ జగన్‌ యాత్ర కొనసాగింది. కృష్ణాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర... పాముదుర్తి వరకు సాగింది. అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జగన్‌కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్‌... నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా... ఇప్పటి వరకు ప్రజలకు, రైతులకు చేసిందేమీ లేదని, బాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని, మహిళలకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు వైసీపీ అధినేత జగన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories