మరో మైలురాయిని దాటినా జగన్..!

Highlights

ప్రజాసమస్యల ప్రత్యంక్షంగా తెలుసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు మరో మైలురాయిని...

ప్రజాసమస్యల ప్రత్యంక్షంగా తెలుసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు మరో మైలురాయిని చేరుకుంది.. పాదయాత్రలో జగన్ 400 కిలో కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. బుధవారం నాటికి 396.9 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్, జిల్లాలో నేడు నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా గుమ్మేపల్లి వద్దకు రాగానే 400 కి.మీ మైలురాయిని చేరుకుని అక్కడ మొక్కలు నాటారు.

ఈ నెల 6న కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జగన్ జగన్ నేడు 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు..కాగా నేడు 29 రోజు పాదయాత్రలో భాగంగా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories