నేడు ఎన్నడూ చేయని పని చేయబోతున్న జగన్..!

Highlights

రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ చేయని పనికి నేడు శ్రీకారం చుట్టనోతున్నారు.. ఇప్పటికే మూడొందల మైలురాళ్లు...

రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ చేయని పనికి నేడు శ్రీకారం చుట్టనోతున్నారు.. ఇప్పటికే మూడొందల మైలురాళ్లు దాటేసిన జగన్ ఇవాళ తన సొంత ఛానెల్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకోబోతున్నారు.. సాధారణంగా జగన్ మీడియాకు దూరంగా ఉంటారు.. ఎక్కడా ఆయన చొరవ చేసి మాట్లాడరు. ఏం చెప్పాలన్నా తన సొంత మీడియా ద్వారానే వెల్లడిస్తారు.. ఏదైనా అంశం తాను చెప్పాలనుకుంటే జాతీయ మీడియా ముందు మాత్రమే నోరు విప్పుతారు.. పైగా జగన్ తన సొంత ఛానెల్ పెట్టి ఇన్నేళ్లయిపోయినా.. ఎప్పుడూ జగన్ తన మీడియాలో తన ఇంటర్వ్యూ ప్రసారం చేయలేదు. సీనియర్ పాత్రికేయుడు చేసే ఇంటర్వ్యూలో తొట్ట తొలిసారిగా.. జగన్ తన మనోభావాలు పంచుకోబోతున్నారు.. ఓ పక్క పార్టీని వీడి పచ్చ జెండా పట్టేసుకుంటున్న ఎమ్మెల్యేలను అదుపు చేయడానికీ..చంద్రబాబుపై తన విమర్శలను ఎక్కు పెట్టడానికీ.. మరోవైపు పవన్ పర్యటనలకు చెక్ చెప్పడానికే వైసిపి వ్యూహాత్మకంగా జగన్ తో తన ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూ ఇప్పిస్తోందా?దీనివెనక ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందా? ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రశాంత్ కిషోర్ మాట తప్ప మరెవరి మాటా వినడం లేదనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories