ఇవాంకా హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..!

ఇవాంకా హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..!
x
Highlights

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇవాంకా ట్రంప్‌.. రెండు రోజులు బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జీఈ సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికా ప్రతినిధి...

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇవాంకా ట్రంప్‌.. రెండు రోజులు బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జీఈ సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఇవాంకా.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ముందుగా కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాతో భేటీకానున్నారు. అనంతరం, 4గంటల 25నిమిషాలకు మోడీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సాయంత్రం 5గంటల 50నిమిషాలకు తిరిగి ట్రైడెంట్‌ హోటల్‌‌కి చేరుకోనున్నారు. రాత్రి 8గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు. తిరిగి 10గంటల 40నిమిషాలకు ట్రైడెంట్‌ హోటల్‌‌కి వెళ్లనున్నారు.

రాత్రికి ట్రైడెంట్ హోటల్ లోనే బస చేయనున్న ఇవాంక.. నేడు ఉదయం 10గంటలకు జీఈ సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5గంటల 35నిమిషాలకు హోటల్‌ ఖాళీ చేయనున్న ఇవాంకా.. రాత్రి 8గంటల 20నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. మధ్యలో ఏం చేస్తారన్నది షెడ్యూల్‌లో పేర్కొనలేదు. ఇవాంకా ఉదయం హెచ్ఐసీసీలోని సదస్సుకు హాజరై, మధ్యాహ్నం 12 గంట‌ల తర్వాత బయటకు వెళ్తారు. ఆమె ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని సెక్యూరిటీ అధికారులు రహస్యంగా ఉంచారు. అయితే ఇలా షెడ్యూల్‌లో చూపని, రిజర్వ్‌గా పేర్కొన్న ఖాళీ సమయాల్లో ఇవాంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారా.. అన్నది ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories