logo
సినిమా

సాయిప‌ల్ల‌వి హ‌వా

సాయిప‌ల్ల‌వి హ‌వా
X
Highlights

'ఫిదా' చిత్రంలో భానుమ‌తి పాత్ర‌లో జీవించేసింది సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో తెలుగునాట ఈ...

'ఫిదా' చిత్రంలో భానుమ‌తి పాత్ర‌లో జీవించేసింది సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో తెలుగునాట ఈ ముద్దుగుమ్మ‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ప‌ర్య‌వ‌సానంగా.. త‌మిళంలో, మ‌ల‌యాళంలో ఆమె చేసిన‌, చేస్తున్న సినిమాల‌ను తెలుగులో కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఇక్క‌డి నిర్మాత‌లు. ఈ నాలుగు నెల‌ల్లో సాయి ప‌ల్ల‌వి న‌టించిన మ‌రో మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

దుల్క‌ర్ స‌ల్మాన్‌తో సాయిప‌ల్ల‌వి న‌టించిన 'క‌లి' అనే మ‌ల‌యాళ‌ చిత్రం 'హేయ్ పిల్ల‌గాడా' పేరుతో అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా.. నాగ‌శౌర్య‌తో క‌లిసి న‌టించిన త‌మిళ చిత్రం 'క‌రు' తెలుగులో 'క‌ణం' పేరుతో ద్విభాషా చిత్రంగా అక్టోబ‌ర్ నెల‌లో రిలీజ్ కానుంది. అలాగే నాని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతున్న 'ఎం.సి.ఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) కూడా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్తానికి.. టాలీవుడ్‌లో సాయిప‌ల్ల‌వి హ‌వా బాగానే ఉంద‌న్న‌మాట‌.

Next Story