ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం!

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం!
x
Highlights

కొన్ని సినిమా కథలు తిరిగి..తిరిగి ...ఎ హీరోకి వేలతాయో చెప్పటం చాల కష్టం... అలాంటి సినిమానే...ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. ఇది 2001 లో విడుదలై ఘనవిజయం...

కొన్ని సినిమా కథలు తిరిగి..తిరిగి ...ఎ హీరోకి వేలతాయో చెప్పటం చాల కష్టం... అలాంటి సినిమానే...ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. ఇది 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా[. సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయంతో పూరీతో బాటు కథానాయకుడు రవితేజ, నాయిక తనూ రాయ్ మరియు సంగీత దర్శకుడు చక్రికి సినీ రంగంలో నిలదొక్కుకునే అవకాశం దొరికింది. పవన్ కళ్యాణ్ కథానాయకునిగా తన మొదటి సినిమా బద్రి సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు. బద్రి సినిమా కథ పవన్ కళ్యాణ్ కి వినిపించేందుకు అవకాశం కోసం ముందుగా కథని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడుకి వినిపించాల్సివచ్చింది. అయితే బద్రి కథ ఇద్దరు హీరోయిన్లు, వారితో ప్రేమ పేరుతో పందెం వంటి రిస్కీ అంశాలతో ఉండడంతో ఛోటాకు నచ్చకుంటే పవన్ కళ్యాణ్ కి కథ చెప్పే అవకాశమే పోతుందన్న భయం పట్టుకుంది పూరీ జగన్నాథ్ కి. దాంతో సేఫ్ బెట్ అన్న ఉద్దేశంతో ఈ కథని వినిపించారు. అయితే ఛోటాకి ఈ కథ చాలా నచ్చేయడంతో పవన్ కి చెప్పే వీలుదొరికింది, కానీ పూరీ పవన్ కి మాత్రం బద్రి కథనే చెప్పి ఓకే చేయించుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించాకా ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారుట పూరీ. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories