Top
logo

ముందే ఊహించిన రేవంత్‌...మూడ్రోజుల క్రితం...

X
Highlights

కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నట్లే జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు...

కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నట్లే జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు బంధువుల ఇళ్ళలో తెల్లవారుజాము నుంచే ముమ్మర ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాడుల సమయంలో ఐటీ అధికారులు ఆయా ఇళ్లల్లో ఉన్నా రేవంత్ కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లు స్విచ్ఆఫ్ చేయించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు కొడంగల్‌లో ఉన్నారు. రేవంత్ కొడంగల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఐటీ దాడులపై రేవంత్ ముందే అనుమానం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతాయని రేవంత్ మూడ్రోజుల క్రితం మీడియాతో చెప్పారు.

Next Story