Top
logo

తన ఇల్లు, సంస్థలపై జరిగిన ఐటి దాడులపై స్పందించిన ఖమ్మం ఎంపీ

తన ఇల్లు, సంస్థలపై జరిగిన ఐటి దాడులపై స్పందించిన ఖమ్మం ఎంపీ
X
Highlights

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 18చోట్ల...

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 18చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంభందించి ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త గూడెంలోని ఎంపీ అనుచర కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లపై కూడా ఐటి దాడులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఐటీ దాడులపై స్పందించారు. తన ఇంటిపై జరిగినవి ఐటీ దాడులు కావని, ప్రతీ ఐదేళ్లకోసారి జరిగే సాధారణ ప్రక్రియ అని సమాధానమిచ్చారు.

Next Story