ఐటీ కమిషనర్ దృష్టికి తీసుకెళతా : రేవంత్ రెడ్డి

ఐటీ కమిషనర్ దృష్టికి తీసుకెళతా : రేవంత్ రెడ్డి
x
Highlights

గతవారం ముప్పైఆరు గంటల పాటు ఐటీ విచారణ ఎదుర్కొన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఈరోజు (బుధవారం) మరోసారి ఐటీ అధికారుల ఎదుట...

గతవారం ముప్పైఆరు గంటల పాటు ఐటీ విచారణ ఎదుర్కొన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఈరోజు (బుధవారం) మరోసారి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన అధికారులు.. ఈనెల 23న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ కక్షలో భాగంగానే తనపై, తన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఐటీ అధికారుల ముసుగులో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం.. తమ కుటుంబంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఐటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి.. ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories