టార్గెట్ ధోనీయే.. SRH విజయంలో కీలకపాత్ర అతనిదే!

టార్గెట్ ధోనీయే.. SRH విజయంలో కీలకపాత్ర అతనిదే!
x
Highlights

కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నిన్న (శుక్రవారం) జరిగిన మ్యాచ్ లో విజయం SRH ను వరించింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట SRH ...

కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నిన్న (శుక్రవారం) జరిగిన మ్యాచ్ లో విజయం SRH ను వరించింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట SRH బ్యాటింగ్ కు ఆహ్వానించింది. KKR బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేవలం 10 బంతులు ఆడిన రషీద్ ఖాన్ నాలుగు సిక్సులు , రెండు ఫోన్ల సాయంతో (34) పరుగులు చేశాడు. ధావన్ (34),సాహా(35) పరుగులు రాణించారు. ప్రత్యర్థి ముందు 175 పరుగుల టార్గెట్ ఉంచారు . అనంతరం బరిలోకి దిగిన KKR జట్టు మొదటిఓవర్ నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద క్రిస్ లిన్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత నరైన్ (26), గిల్(30) రాణించారు. అయితే ఆఖరి మూడు ఓవర్లలో కీలక వికెట్లు పడటంతో KKR కష్టాల్లో పడింది. దీంతో గెలుస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి చెందింది. కాగా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ సాధించడంలో రషీద్ ఖాన్ తోడ్పడ్డాడు.. SRH విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రెండో ప్లే ఆఫ్ లో గెలుపొంది ఆదివారం చెన్నై జట్టుతో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది హైదరాబాద్. కాగా రెండేళ్ల విరామం తరువాత ఎలాగైనా సిరీస్ సాధించాలని చెన్నై, ధోనిని నిలువరించాలని హైదరాబాద్ జట్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories