‘ఇంటిలిజెంట్’ రివ్యూ

నిర్మాణ సంస్థ: సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి తారాగణం: సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్,...
నిర్మాణ సంస్థ: సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి
తారాగణం: సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, వినీత్‌కుమార్, జె.పి. పృథ్వీ,కాదంబరి కిరణ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు
కథ, మాటలు: శివ ఆకుల
ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్
సంగీతం: థమన్
కూర్పు: గౌతంరాజు
కళ: బ్రహ్మ కడలి
సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
నిర్మాత: సి.కళ్యాణ్
కథనం, దర్శకత్వం: వి.వి.వినాయక్.
మెగా డైరెక్టర్ వివి వినాయక్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.... ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇంటిలిజెంట్' సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను వినాయక్ తన కమర్షియల్ ఫార్ములాతో హిట్ బాట పట్టిస్తాడని అంతా నమ్మకంగా ఎదురు చూశారు. గతంలో నాయక్, తులసి, లక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కారణమైంది. మరి ఈ సనిమా ఏ మేరకు ప్రేక్షకును మెప్పించింది అనేది అనేది సమీక్షలో చూద్దాం.....
కథ: విజన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అధినేత నందకిషోర్ (నాజర్) అనాథలకు, పేదవాళ్లకు సహాయపడుతుంటాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. నందకిషోర్ సహాయంతో చదువుకుని... ఆయన కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు తేజ (సాయిధరమ్ తేజ్). తన స్నేహితులు (రాహుల్ రామకృష్ణ, సప్తగిరి, నల్లవేణు)లతో కలిసి, నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉండే తేజు జీవితంలోకి ఓ అమ్మాయి (లావణ్య త్రిపాఠి) ఎంటర్ అవుతుంది. ముందు తేజ అంటే ఇష్టపడకపోయినా.. అమ్మాయిలంటే అతనికున్న గౌరవాన్ని చూసి అతన్ని ఇష్టపడుతుంది. అదే సమయంలో నందకిషోర్ తన కంపెనీ ఉద్యోగులకు చేస్తున్న బెనిఫిట్స్ చూసి.. నందకిషోర్‌ను దెబ్బ కొట్టి.. కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటారు ప్రత్యర్థి వర్గం. అందులో భాగంగా మాఫియా డాన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్), అతని తమ్ముడు (దేవ్ గిల్)ల సహాయం తీసుకుంటారు. విక్కీ అండ్ గ్యాంగ్ నందకిషోర్‌ను బెదిరించినా లొంగడు. ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిష్టర్‌ను కలవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా తన కంపెనీ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను విక్కీకి రాసేసి ఆత్మహత్య చేసుకుంటాడు నందకిషోర్. అదే సమయంలో తేజపై ఎటాక్ కూడా జరగుతుంది. అసలు నంద కిషోర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అసలు అది ఆత్మహత్యా? హత్యా? చివరకు తనకు అండగా నిలబడ్డ నందకిషోర్ అండ్ ఫ్యామిలీ కోసం తేజ ఎలాంటి సాహసం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ: సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ వంక పెట్టే విధంగా ఏమీలేదు... అదే సమయంలో గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎప్పటిలాగే రోటీన్ గా కనిపించాడు. ధర్మాభాయ్ పాత్రలో కనిపించాడు కానీ అందులో ప్రత్యేక శైలి చూపించలేకపోయాడు. ఫైట్స్ ఇరగదీశాడు... చమక్ చమక్ ఛాం పాలో చిరంజీవిని గుర్తు చేశాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. సినిమాలో ఆమెది పరిమితమైన పాత్ర. నటించడానికి అవకాశం కూడా లేదు. అయితే సాయి ధరమ్ తేజ్ సరసన డాన్స్ స్టెప్పులు వేయడంలో తేలిపోయింది. ఆమె ఏదో కాళ్లు చేతులు ఆడిండిచనట్లు కనిపించిందే తప్ప రిథమ్ కనపించలేదు. డ్యూయెట్ సాంగులపై ఈ ఎఫెక్టు బాగా కనిపించింది. సినిమాలో ఇతర పాత్రల గురించి మాట్లాడుకుంటే.... నంద కిషోర్ పాత్రకు నాజర్ పూర్తి న్యాయం చేశారు. విలన్ పాత్రల్లో కనిపించి రాహుల్ దేవ్, దేవ్ గిల్... పవర్‌ఫుల్ కనిపించలేదు. హోం మినిస్టర్ పాత్రలో వినీత్ కుమార్, పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ఫర్వాలేదనిపించారు. సినిమాలో బ్రహ్మానందం, బద్రం, పృథ్వి, రాహుల్ రామకృష్ణ, నల్లవేణు, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ఫిష్ వెంకట్ తదితర కమెడియన్లు ఉన్నా సినిమాలో పెద్దగా కామెడీ పండలేదు. సినిమా మొత్తం మీద ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించలేదు. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఎస్వీ విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. తమన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేకున్నా ఓకే అనొచ్చు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది. సికె ఎంటర్టెన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బావున్నాయి.
బలాలు:
- డాన్సులు
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
బలహీనతలు:
- కథ, కథనం బలంగా లేకపోవడం
- సినిమాకు మూలంగా సాగే ఎంటర్‌టైన్‌మెంట్ మరి వీక్‌గా ఉండటం
- లాజిక్స్ లేని రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
- దర్శకత్వం
- సంగీతం, నేపథ్య సంగీతం
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT