logo
జాతీయం

కులాంతరానికి సై.. పెళ్ళి తరువాత ఇంటిపేరు మార్పు వద్దూ..

కులాంతరానికి సై.. పెళ్ళి తరువాత ఇంటిపేరు మార్పు వద్దూ..
X
Highlights

భారతీయ యువతలో నానాటికి పెళ్లి విషయంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి విషయంలో కులాలు అవసరం లేదంటున్న ...

భారతీయ యువతలో నానాటికి పెళ్లి విషయంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి విషయంలో కులాలు అవసరం లేదంటున్న యువత రేవరైనా ఓకే అంటున్నారు. తాజగా ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 'పల్స్‌ ఆఫ్‌ ద నేషన్‌' పేరుతో ఇన్‌షార్ట్స్‌ అనే యాప్‌ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొన్నారు. అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఇక తరతరాలుగా వస్తున్న కట్న కానుకల విషయంలో కట్నం మహిళ కుటుంబసభ్యులే ఇవ్వాల్సిన పనిలేదని పైగా పెళ్లి ఖర్చులు పురుషులు కూడా భరించాల్సిన అవసరం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాదు 80 శాతం మంది మహిళలు పెళ్లైయ్యాక తమ భర్తల ఆదాయం ఎక్కువగా ఉన్నా పరవాలేదంటోంది. 7 శాతం మంది పురుషులు మాత్రం భర్త కంటే భార్య సంపాదన తక్కువగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Next Story