logo
జాతీయం

నేడే ఐపీఎల్‌ వేలం : ఎన్నికలు కూడా అప్పుడే..

నేడే ఐపీఎల్‌ వేలం : ఎన్నికలు కూడా అప్పుడే..
X
Highlights

ఐపీఎల్ 2019సీజన్‌ వేలం నేడు జరగనుంది. జైపూర్ వేదికగా 8ఫ్రాంచైజీలు ప్రతిభగల ఆటగాళ్లను కొనుగోలు చేసుకోనున్నాయి....

ఐపీఎల్ 2019సీజన్‌ వేలం నేడు జరగనుంది. జైపూర్ వేదికగా 8ఫ్రాంచైజీలు ప్రతిభగల ఆటగాళ్లను కొనుగోలు చేసుకోనున్నాయి. గతనెలలో జట్లలోని ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన వారి జాబితాను ప్రకటించింది బీసీసీఐ. ఈ వేలంలో టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేయనుండగా.. 346 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం. కాగా వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్‌ జరగనున్న సందర్బంగా... ఐపీఎల్ 2019సీజన్‌ లీగ్‌ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల సన్నాహాలకు, ప్రపంచ కప్‌ నాటికి క్రికెటర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండేలా డిసెంబరులోనే వేలం ప్రారంభించారు. మరోవైపు ఏప్రిల్‌–మే మధ్య దేశంలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్‌ నిర్వహణ ఎక్కడ అనేదానిపై జనవరి 10 తరువాత బీసీసీఐ నుంచి స్పష్టత రానున్నట్లు సమాచారం.

Next Story