logo
జాతీయం

నాయకత్వ లక్షణాలు దాచితే దాగవు

నాయకత్వ లక్షణాలు దాచితే దాగవు
X
Highlights

130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల్లో... నాయకులుగా తయారవుతున్నది ఎంతమంది? ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్నది ...

130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల్లో... నాయకులుగా తయారవుతున్నది ఎంతమంది? ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్నది మన దేశమే. మరి వీరిలోంచి నాయుకులన్నవారు ఎవరూ పుట్టరా? నాయుకత్వం అంటే కేవలం రాజకీయాలు.. ఎన్నికలు.. ఓట్లు.. కుట్రలు.. కుతంత్రాలేనా? మహిళలు అసలు ఇందులోకి అడుగు పెట్టరా? నాయుకత్వ లక్షణాలు అనేవి ఒకరు నేర్పితే వచ్చేవి కావు.. అవి పుట్టుకతోనే రావాలి. అలాంటివి ఉన్నవారిని కూడా లక్ష్యాల పేరుతో తొక్కేస్తే.. ఇక ఆ నాయుకుడు ఎప్పటికీ పైకి రాడు. ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థిసంఘం ఎన్నికల బరిలో నిలిచిన ఆరుగురూ... అమ్మాయిలే! మరి వాళ్లెలా ముందుకొచ్చారు.. మనమెందుకు రాకూడదు.. ఓసారి చూద్దామా?

రాజకీయాలు, నాయకత్వ లక్షణాలనేవి బొమ్మా బొరుసు లాంటివి. ఏ ఒక్కటి లేకపోయినా నాణెం చెల్లుబాటు కాదు. అలాగే ఇల్లయినా, మనముంటున్న సమాజైమెనా, మనం పనిచేస్తున్న ఆఫీసు అయినా.. అక్కడకూడా నాయుకత్వ లక్షణాలు అవసరం. అంతర్గత రాజకీయాలు హ్యాండిల్ చేసేందుకే ఇవి పనికొస్తాయి కానీ మరెందుకూ కాదని అస్సలు భావించవద్దు. మన ఇంట్లోకూడా ఉన్న నలుగురికి మంచి, చెడు దిశానిర్దేశం చేసి.. నలుగురినీ ఒకే తాటిైపెకి తీసుకువచ్చి.. సంసారమనే సాగరాన్ని సులువుగా ఈదేందుకు చుక్కానిలా ఈ నాయకత్వ లక్షణాలు ప్రతిఒక్కరికి అవసరమౌతాయి. అంటే మన లక్ష్యాన్ని చేరేందుకు లీడర్షిప్ క్వాలిటీలుండడం షార్ట్ కట్ వంటిదన్నమాట. స్మార్ట్‌గా పనిచేసేందుకు ఇవి చక్కగా తోడ్పడతాయి.

నాయుకత్వ లక్షణాలు దాచితే దాగవు..
రాజకీయాల్లో రాణించాలంటే అది చిన్న వయసులోనే ప్రారంభం కావాలి. నాయుకత్వ లక్షణాలు దాచితే దాగవుమరి. పువ్వు పుట్టగానే పరివుళిస్తుందన్నట్టు.. నాయకత్వ లక్షణాల గుబాళింపు దాచితే అస్సలు దాగదు. వాటిని ఎక్కువకాలం తొక్కిపెట్టలేరు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలెప్పుడూ అతి సహజంగా జనాకర్షణను కలిగి ఉంటాయి. మనం నాయుకులం, లీడర్లం అని బోర్డు పెట్టుకుంటే ఆ గుర్తింపు రాదు.

అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో లీడర్ల కొరత!
అమ్మాయిైలెనా, అబ్బాయిైలెనా రాజకీయాలను, ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాలంటే సరైన వేదిక విద్యాలయాలు. అందుకే విద్యార్థి దశలోనే లీడర్షిప్ క్వాలిటీలను పెంపొందించుకోవాలి, వాటిని ఆకళింపు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. పిరికితనం, మొహమాటం, సిగ్గు, ఓపిక లేకపోవటం ఇలా కారణాలు ఏవైనా కొత్త లీడర్లు పుట్టకుండా, ఎదగకుండా మనదేశాన్ని లీడర్ల కొరత పట్టిపీడిస్తోంది.

చెప్పుకోవడానికి 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశానికి పిడికెడుమంది కూడా లీడర్లు లేరు. ఇక యువనేతలు అస్సలు లేరనే చెప్పాలి. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవుస్య.. నాయుకత్వ లోపం. ఇంకా చెప్పాలంటే.. మనదేశంలో టీచర్లు, డాక్టర్లు, యాక్టర్లు, ఇంజినీర్లు, టైలర్లు, స్టయిలిస్టులు, డిజైనర్లు, షెఫ్‌లు, డ్రైవర్లు ఇలా అన్ని రంగాల్లోనూ ఆరితేరినవారు లెక్కకు మించే ఉన్నారు. కానీ లీడర్లు.. వీరి సంఖ్య శూన్యం. ఉన్నవారంతా పాత తరం వారు, సీనియర్లు మాత్రమే.

మహిళా నేతల మాటేంటి?
పొద్దున్న లేచినప్పటినుంచి సమానత్వం అని గొంతు చించుకునేవారికి మనదేశంలో అస్సలు కొరత లేదు. కానీ రాజకీయాల్లో మహిళలంటే మాత్రం అస్సలు కనిపించరు. ఊకదంపుడు ఉపన్యాసాలకు తప్పితే సీరియస్ వుమెన్ లీడర్లు మనదేశంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. అదేమంటే చిన్నప్పటినుంచీ, మార్కులు, ర్యాంకులే టార్గెట్లు. ఆతరువాత ఇక్కడ సీటు ..అక్కడ అడ్మిషన్ రావాలనే లక్ష్యాలు. ఆతరువాత ఈ కంపెనీలో ఉద్యోగం, ఆ కంపెనీలో ఉద్యోగం .. ఈ పొజిషన్ .. ఆ పొజిషన్ ఇదే సరిపోయింది. ఈ దశలన్నీ దాటేటప్పటికీ సొమ్మసిల్లి.. మెకానికల్ జీవితానికి బానిసై బతుకు జీవుడా అంటూ జీవనాన్ని అలా నెట్టుకొస్తే చాలు.. హ ర్కిలిస్ అయిపోవచ్చు అనేలా జీవనచక్రంలో కూరుకుపోయి, రొటీన్‌లో మునిగిపోతారు.

యూనివర్సిటీ ఎన్నికలపై శీతకన్నెందుకు ?
గురువారం జరిగిన పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో మొత్తం విద్యార్థుల సంఖ్య 17,000. అయినా కేవలం ఏడుగురు మాత్రమే ఇందులో పోటీచేశారు. పైపెచ్చు ఎన్నికలు జరుగుతున్నాయనే సమాచారంకూడా వీరెవ్వరికీ లేదట. ఇక ఢిల్లీకి అత్యంత సమీపంలోనే ఉన్న ఈ యూనివర్సిటీ ఎన్నికల్లో పోటీచే సిన మహిళా అభ్యర్థుల సంఖ్యను ప్రస్తావించకపోవడమే మేలు. అంటే రాజకీయాలంటే వీరికి ఆసక్తిలేదా, లేక భయుపడి పోటీ చేయడం లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక శుక్రవారం జరిగిన జేఎన్‌యు ఎన్నిక మన దేశంలో అన్ని యూనివర్సిటీలలోకీ అత్యుత్తమైమెందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాదికూడా మొత్తం ఆరు పెద్ద పార్టీలు, ఆరుగురు మహిళా అభ్యర్థులనే బరిలోకి దించాయి. సెప్టెంబరు 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. కమ్యూనిస్ట్ పార్టీ నేత డీ రాజా కుమార్తె అపరాజితా రాజా పోటీలో దిగి, ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో వేడి రాజేశారు. గీతాకుమారి, నిధి త్రిపాఠి, షబానా అలి, వ్రిష్నికా సింగ్ వంటి విద్యార్థినులంతా జేఎన్‌యూ బరిలో నిలవడం చరిత్రాత్మక ఎన్నికగా మారింది.

విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడి....
అకడమిక్స్ దెబ్బతింటాయి, విద్యాసంస్థల్లో రాజకీయాలు ప్రవేశించడంతో వాతావరణం కంపు కంపుగా మారుతుంది, ఫీజులు పెరిగినప్పుడు తమపై విద్యార్థులు దాడులు చేస్తారనే భయం ప్రైవేటు యాజమాన్యాలను శాసిస్తాయి. అందుకే వీరంతా విద్యార్థులను రాజకీయాలవైపు మళ్లకుండా.. అసలు రాజకీయాలు తమ కాంపౌండ్‌లోకి కూడా అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతెందుకు ప్రతి రాజకీయ పార్టీకి విద్యార్థి విభాగం తప్పకుండా ఉంటుంది, మరి ఇలాంటి విద్యార్థి సంఘాల్లో ప్రైవేటు విద్యాలయాల్లో ఎన్ని అడుగుపెట్టగలిగాయి ? అంటే ఈ విద్యా సంస్థల యాజమాన్యాలే విద్యార్థుల్లోని నాయుకత్వ లక్షణాలను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తున్నాయున్నమాట. అందుకే తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా మీరుమాత్రం మీ పిల్లల్లోని నాయుకత్వ ప్రతిభను గుర్తించి, దానికి మెరుగులు దిద్దండి. ఇదే ఈరోజు కుటుంబం మీకిస్తున్న అమూల్యైమెన సలాహా. మీ కుటుంబం దేశానికి మంచి నాయుకుడు, నాయుకురాలిని అందించాలని మనం ఆకాంక్షిస్తోంది.

సూపర్‌వుమెన్ కానక్కర్లేదు
రాజకీయాల్లో మహిళలు ఎదగాలంటే సూపర్ వుమెన్ కానక్కర్లేదు. ఉదాహరణకు ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తీసుకోండి. సవుకాలీన రాజకీయాల్లో ఉన్నవారిలో అత్యధికులు ఇక్కడ పుట్టినవారే. ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, నిర్మలా సీతారామన్‌వంటివారు జేఎన్‌యూలో లీడర్లుగా పుట్టగా.. ఢిల్లీ యూనివర్సిటీనుంచి వచ్చిన నరేంద్ర మోదీ ఏకంగా ప్రధానికాగా ఆయన మంత్రి వర్గంలో అత్యధికులు ఇలా స్టూడెంట్ యూనియన్ నేతలే. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, విజయ్ గోయుల్, ఢిల్లీకి 3 సార్లు సీఎంగా హ్యాట్రిక్ సాధించిన షీలా దీక్షిత్, మరో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, శశిథరూర్, మణిశంకర్ అయ్యర్, అల్కా లాంబా, కేజ్రీవాల్‌పై పోటీచేసిన నూపూర్ శర్మ వీరితోపాటు ఇంకా చాలామంది డీయూ, జేఎన్‌యూల నుంచే తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏబీవీపీ నేతగా సుష్మా స్వరాజ్, జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన కన్హయ్య కుమార్ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నిలదొక్కుకోగలిగారు. వీరంతా రాజకీయాలనే వృత్తిగా స్వీకరించి, తాము విశ్వసించిన సిద్ధాంతాలనే సోపానాలుగా మలచుకుని దూసుకుపోతున్నారు. అంతేకాదు.. తమ పొలిటికల్ కెరీర్‌ను.. వీరంతా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మరి వీరితో కలిసి చదువుకున్న విద్యార్థుల ప్రస్థుత పరిస్థితి ఏమిటి ?

కరణం భార్గవి

మంచి నాయకులకు డిమాండ్!
అందుకే మనదేశంలో ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా నాయుకులకు చాలా డిమాండ్ ఉండబోతోంది. మీరు నాయుకులు కాలేకపోయినా దిగులు చెందవద్దు, పదిమందికి ఉపయోగపడే గొప్ప నాయుకులుగా మీ పిల్లలను తీర్చిదిద్దండి, సమీప భవిష్యత్‌లో మనం రాజకీయ నాయుకులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మనదేశానికి పట్టకూడదు. మళ్లీ మనం ఏ దేశానికో ఒక వలస దేశంగా (కాలనీగా) బతకాల్సిన దౌర్భాగ్యం దాపురించరాదు. ఏం మీ పిల్లలు లీడర్లయితే వారి భవిష్యత్ చెడిపోతుందా? నలుగురికీ తలలో నాలుకలా ఉండి, అందరి అభివృద్ధికి పాటుపడితే మీ ఆస్తులు కరిగిపోతాయా ? లేక మీకు, మీకుటుంబానికి ఏమైనా చెడ్డపేరు వస్తుందా? ఇవేవీ కానప్పుడు మీ పిల్లలు రామాయుణంలో పిడకల వేటలా ఎందుకు మీలా, ఇంకొకరిలా, మరొకరిలా బతకాలి? మీ భవిష్యత్ అయిన మీ పిల్లల్లో నాయుకత్వ లక్షణాలున్నాయా.. మురిసిపోండి.. వారిని మంచి నేతలుగా ఎదిగేలా పరితపించండి.. అప్పుడు మీరు దేశానికి మంచి నేతను ఇస్తే.. మాతృదేశం రుణం తీర్చుకున్నవారవుతారు. మీ బిడ్డ మంచి నాయ తే.. మీరే పది తరాలను కాపాడినవారవుతారు.

అర్థం పర్థం లేని ఆంక్షలతో వారిలోని నాయుకత్వపటిమను, నేత కావాలనుకునే వారి ఆకాంక్షలను చిదివేుయుకండి. వారి భవిష్యత్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదనే సత్యాన్ని గ్రహించండి. ఒకప్పుడు ఉపగ్రహాలను, క్షిపణులను దిగుమతి చేసుకునే మనం.. నేడు సొంతంగా ఎలాంటి అత్యాధునిక సామగ్రిైనెనా సొంత పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నాం. మరి.. నాయకులను ఎందుకు తయారుచేసుకోకూడదు? అంటే భావి పౌరుల కోసం భవిష్యత్‌లో లీడర్లను కూడాదిగుమతి చేసుకుందామా ? క్రికెట్ కోచ్‌లను దిగుమతి చేసుకున్నట్టు దేశాధినేతలను, మంత్రులను, ఎంపి, ఎంఎల్‌ఏలను దిగుమతి చేసుకునే వందకోట్ల పైచిలుకు చవటలమా? ఆలోచించండి .. మీ పసివాళ్లలో లీడర్ కావాలన్న తపన ఉంటేమాత్రం వారిని ప్రోత్సహించండి.

Next Story