అగ్ని–5 సూపర్ సక్సెస్‌!

అగ్ని–5 సూపర్ సక్సెస్‌!
x
Highlights

దేశీయంగా తయారుచేసిన అన్వాయుధాలను మోసుకెళ్లే అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం 9:45 ప్రయోగించిన ఈ ప్రయోగం...

దేశీయంగా తయారుచేసిన అన్వాయుధాలను మోసుకెళ్లే అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం 9:45 ప్రయోగించిన ఈ ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–5 ఉపరితలం నుంచి ఉపరితల ప్రయోగాలకు ఉపయోగపడుతోంది. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్లేలా చేయడం కోసం రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, అందుకోసం ప్రత్యేక కంప్యూటర్‌ను వినియోగించారు. కాగా భవిష్యత్తులో అగ్ని-5 కు మిర్వ్ సామర్థ్యాన్ని కలుగజేస్తారు. ఒక్కొక్క క్షిపణికి 2–10 వేరువేరు అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది.ఒక్కో వార్‌హెడ్‌కు ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఈ లక్ష్యాలు వందల కి.మీ. దూరంలో ఉంటాయి. లేదా ఒకే లక్ష్యం మీద ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్లను అగ్ని–5 ప్రయోగించగలదు.

ప్రత్యేకతలు..
* 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 ట న్నుల బరువుండే ఈ అత్యాధునిక క్షిపణి 1500 కేజీల అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
* ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే.. 5000–5500 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ల సరసన భారత్‌ చేరుతుంది.
* అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3 క్షిపణులు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి.
* ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి ఇదే.
* తూర్పున చైనా మొత్తం, పడమరన యూరప్‌ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఆసియా, యూరప్‌ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories