వివిధ రాజకీయ పార్టీల ఆదాయ వ్యయాలు.. ఎంతంటే..

వివిధ రాజకీయ పార్టీల ఆదాయ వ్యయాలు.. ఎంతంటే..
x
Highlights

2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌)...

2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలను వెల్లడించాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) తాజాగా నివేదిక రూపొందించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భాజపా ఆదాయం 1,027.34కోట్లు గా ఉంది. అయితే ఇందులోనుంచి రూ. 758.47కోట్లు ఖర్చు చేసినట్లు భాజపా తెలిపింది. ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) ఆదాయం రూ. 51.7కోట్లు ఉండగా.. ఇందులో నుంచి రూ. 14.78 కోట్లు పార్టీ ఖర్చు చేసినట్టు ఆ పార్టీ ఏడీఆర్‌ కు నివేదిక ఇచ్చింది. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ రూ. 8.15కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా.. ఖర్చులు రూ. 8.84కోట్లుగా ఉన్నాయి. ఈ పార్టీకి ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌, టీఆరెస్, సీపీఎం, పార్టీలు గడువులోగా తమ ఆడిట్‌ నివేదికలను (ఏడీఆర్‌) సమర్పించగా.. ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఆదాయ వ్యయాల నివేదికను సమర్పించలేదు. అలాగే దేశంలోని కొన్ని పార్టీలు తమ ఆదాయ వ్యయాలను సమర్పించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories