మేము పాకిస్థాన్ వెళతాం : మాజీ క్రికెటర్లు కపిల్, సిద్దూ

ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికలలో పాక్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ విజయం ...
ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికలలో పాక్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము హాజరవుతామని భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ లు తెలిపారు. పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో పాక్ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గిన విషయాన్ని సిద్ధూ ప్రస్తావించారు. ఇమ్రాన్ నమ్మదగ్గ వ్యక్తి అని, వ్యక్తిత్వమున్న మంచి మనిషి అని సిద్ధూ కొనియాడారు. భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు అభివృద్ధి చేసేందుకు ఇమ్రాన్ కృషి చేస్తారని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత్ నుంచి అధికారికంగా ఎవరెవరు వెళతారోనన్న ఆసక్తి నెలకొంది. తాజాగా క్రికెటర్లు కపిల్ దేవ్, సిద్ధూ ఇద్దరు హాజరవుతున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు ఫారిన్ లీడర్స్ ను ఎవ్వరిని కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT