తెలుగు త‌ల్లికి వంద‌నం

తెలుగు త‌ల్లికి వంద‌నం
x
Highlights

తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా.. అంటూ తెలుగు అందాలను అధ్బుతంగా వర్ణించారు ప్రముఖ సినీకవి ఆచార్య ఆత్రేయ....

తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా.. అంటూ తెలుగు అందాలను అధ్బుతంగా వర్ణించారు ప్రముఖ సినీకవి ఆచార్య ఆత్రేయ. నిజంగానే తెలుగు భాష తియ్యదనం అలాంటిది మరి. అందుకే తెలుగు భాష ప్రాధాన్యాన్ని అలనాటి శ్రీకృష్ణదేవరాయలి నుంచి నేటి పాలకుల వరకు అందరూ గుర్తిస్తున్నారు. తెలుగుకు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా తెలంగాణలో తెలుగు భాష పరిరక్షణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదినుంచి అన్ని విద్యాసంస్థలు ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాలని తెలిపారు. అలా చెప్పని విద్యాసంస్థలకు రాష్ట్రంలో అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ బోర్డులను తెలుగులో కూడా రాయాలని ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్భంగానే తెలుగుకు పెద్దపీట వేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. ఉర్దూ కోరుకునే వారికి ఆ భాషను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఉంచాలని ఆయన తెలిపారు.

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్‌ స్థాయులలో బోధించే తెలుగు సబ్జెక్టు సిలబస్‌ రూపొందించే బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడ మీకి అప్పగించారు. వెంటనే సిలబస్‌ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా కుండ బద్దలుకొట్టారు. నిజానికి ఇది చాలా మంచి నిర్ణయం. ఇంజనీరింగ్‌ చదివిన పిల్లలు కూడా బయటకు వచ్చిన తర్వాత గట్టిగా వార్తాపత్రిక చదవ మంటే తమకు తెలుగు రాదని చెబుతున్నారు. మాత భాష కనీసం రాకపోవడం దౌరాగ్యేం. ఈ పరిస్థితి పోగొట్టాలని భాషావేత్తలు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. దివంగత బూదరాజు రాధాకృష్ణ‌ లాంటి భాషా పండితులు దీనిపై ఎంతగానో కృషి చేశారు. పిల్లల్లో తెలుగు భాష పట్ల అనురక్తి పెంచడానికి దినపత్రికల ద్వారా కూడా చాలా ప్రయత్నం జరిగింది.

పిల్లలకు ఇష్టమైన అంశాలను పత్రికలలో ప్రచురించడం ద్వారా వారిని ఆకట్టుకోవాలని చూశారు. కానీ, చదువుల పేరుతో కేవలం పుస్తకాలకు మాత్రమే అతుక్కుపోయిన పిల్లలు, అసలు వేటినీ పట్టించుకోవడం మానేశారు. అలాగే టీవీ కార్టూన్‌ సీరియళ్లలో కూడా ఇంగ్లీషువే పెట్టుకోవడం వల్ల ఇక వాళ్లకు తెలుగుతో అవసరం లేకపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందులోనూ తెలంగాణలో కొంతకాలం పాటు ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంతవరకు తెలుగు వెనకబడింది. ఈ నేపథ్యంలోనే తర్వాతి తరానికి తప్పనిసరిగా తెలుగు రావాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా సంస్థలలో తెలుగు రాకపోవడానికి మరో ప్రధాన కారణం మార్కులు. మార్కుల కోసం అని పిల్లలను సంస్కతం ఒక భాషగా తీసుకోవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు కంటే సంస్కృతంలో ఉండటానికి అవి ఉపయోగపడతాయన్న భావన కొంతవరకు పిల్లలను తెలుగుకు దూరం చేసింది. ప్రస్తుతం పిల్లలకు ఇంగ్లీషు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తప్పనిసరి)గా ఉంది.

సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద తెలుగు, హిందీ, సంస్క తం, ఉర్దూ, ఫ్రెంచ్‌, అరబిక్‌, కన్నడ, మరాఠీ భాషల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది సంస్క తాన్ని ఎంపిక చేసుకుంటూ తెలుగుకు దూరమవుతున్నారు. జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 4.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది సంస్క తాన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయవచ్చనే కారణం చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగును కూడా తప్పనిసరి చేయడం కొంతవరకు స్వాగతిం చదగ్గ నిర్ణయమే. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే పాఠశాలలే కాక, సీబీఎస్‌ఈ స్కూళ్లలోనూ తెలుగుబోధన తప్పనిసరి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకోసం సీబీఎస్‌ఈ అనుమతి పొందిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో ముందుగా విద్యాశాఖ చర్చిస్తుంది. వాళ్లు ససేమిరా అంటే కేంద్రానికి లేఖరాసి అటు నుంచి నరుక్కు రావాలని కూడా భావిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో మాత భాష మీద మమకారం బాగా పెరుగుతోంది. నిజానికి అందుకు కొంతవరకు హిందీయే కారణం అవుతోంది. కొన్ని పరీక్షలను తప్పనిసరిగా హిందీలో లేదా ఇంగ్లీషులోనే రాయాలని నిర్దేశించడం వల్ల దక్షిణాది విద్యార్థులు తమకు సబ్జెక్టు బాగా వచ్చినా భాషా సమస్యతో వెనకబడిపోతున్నామన్న భావనలో ఉన్నారు. ఉత్తరాది వారికి చాలావరకు హిందీ మాత భాష లాంటిదే. చిన్న చిన్న తేడాలున్నా, చాలావరకు ఉత్తరాది మొత్తం హిందీ వస్తే చాలు. కానీ దక్షిణాదిలో అలాకాదు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, ప్రత్యేక భాష ఉంది. కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం, కేరళలో మళయాళం, ఏపీ, తెలంగాణల్లో తెలుగు.. ఇలా అందరికీ అన్ని భాషలు ఉన్నాయి. ఎవరి కోణంలో చూస్తే వారికి వాళ్ల భాషే ముఖ్యం, అదే గొప్ప.

అలాంటప్పుడు దాన్ని వదులుకోవాలని ఎవరూ అనుకోరు. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో నమ్మ మెట్రో బోర్డులను హిందీలో రాయడానికి వీల్లేదంటూ వాటిని పూర్తిగా తీయించేశారు. అసలు ఇక్కడ హిందీ అవసరం లేదని కూడా అన్నారు. ఎవరి భాష వారికి ముఖ్యమే అయినా, జాతీయ భాష, అంతర్జాతీయ భాషలు కూడా నేర్చుకుని ఉండటం కొంతవరకు అవసరం అవుతుంది. అవి వచ్చినవాళ్లు దేశ విదేశాల్లో ఎక్కడైనా వెళ్లి బతకగలరు. లేకపోతే కేవలం మన సొంత రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. దానివల్ల అవకాశాలు తగ్గుతాయి. ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచి, జర్మన్‌, ఇటాలియన్‌, చైనీస్‌ లాంటి భాషలలో నైపుణ్యం పెంచుకుంటే అపారమైన అవకాశాలు మన తలుపు తడతాయి. అలాగని కేవలం వాటికి మాత్రమే పరిమితం అయిపోయి మాత భాషను నిర్లక్ష్యం చేయడం కూడా సరైనది కాదు. ముందు మన సొంత భాష మనకు బాగా వస్తే అప్పుడు ఇతర భాషలలో కూడా నైపుణ్యం పొందవచ్చు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను స్వాగతించాల్సిందే.

ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణ‌యాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా స్వాగతించారు. సీఎం కేసీఆర్‌కు అభినందనలు చెప్పారు. చాలాకాలం నుంచి ఆశిస్తున్న ఈ నిర్ణ‌యం తెలుగువారికి సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషలతో తెలుగు సమానంగా ఉండాలని సూచించారు. ఏపీ సర్కార్‌ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. తెలుగు భాష వచ్చినవారితో తెలుగులోనే మాట్లాడాలని, మాత భాషను వాడుక భాషగా ఉపయోగించుకోవడం మన కర్తవ్యమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడు చెప్పిన విషయం చాలా లోతైనది. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు. అలాగే ఇద్దరు కన్నడిగులు కూడా కన్నడంలోను, కేరళవాసులు మళయాళంలోను మాట్లాడుకుంటారు కానీ తెలుగువారు మాత్రం ఒకరికొకరు ఎదురుపడినా ఇంగ్లీషులోనో, హిందీలోనో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఏమాత్రం సమర్ధనీయం కాదు. మన భాషను మనం మాట్లాడటం చిన్నచూపుగా భావించడం సరికాదు. ముందుగా మన తల్లిదండ్రులకు, ఆ తర్వాత మన మాత భాషకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి.

బస్సులు, రైళ్లలో చూసినప్పుడు అవతలివారిని పలకరించాలంటే ముందుగా తెలుగులో మాట్లాడేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటున్నారు. తొలుత ఇంగ్లీషులోనో, హిందీలోనో మాట్లాడి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి తెలుగులోకి వచ్చేవాళ్లే ఎక్కువ. ఈ విషయంలో బెంగాలీలను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్లు చాలా వరకు తమ మాత భాషలోనే అన్ని వ్యవహారాలు సాగిస్తారు. తమ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటూ వస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాలు కూడా తమ మాత భాషపై మమకారం పెంచుకోవడంతో పాటు దాన్ని పెంచి పోషించాలి. అందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. తెలంగాణ ప్రభుత్వం వేసిన ముందడుగును ఆంధ్రప్రదేశ్‌ కూడా అంది పుచ్చుకుని తెలుగు బోధనను తప్పనిసరి చేస్తే కొంతవరకు ఫలితం ఉండే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో మాత భాష మీద మమకారం బాగా పెరుగుతోంది. నిజానికి అందుకు కొంతవరకు హిందీయే కారణం అవుతోంది. కొన్ని పరీక్షలను తప్పనిసరిగా హిందీలో లేదా ఇంగ్లీషులోనే రాయాలని నిర్దేశించడం వల్ల దక్షిణాది విద్యార్థులు తమకు సబ్జెక్టు బాగా వచ్చినా భాషా సమస్యతో వెనకబడిపోతున్నామన్న భావనలో ఉన్నారు. ఉత్తరాది వారికి చాలావరకు హిందీ మాత భాష లాంటిదే. చిన్న చిన్న తేడాలున్నా, చాలావరకు ఉత్తరాది మొత్తం హిందీ వస్తే చాలు. కానీ దక్షిణాదిలో అలాకాదు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, ప్రత్యేక భాష ఉంది.

కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం, కేరళలో మళయాళం, ఏపీ, తెలంగాణల్లో తెలుగు.. ఇలా అందరికీ అన్ని భాషలు ఉన్నాయి. ఎవరి కోణంలో చూస్తే వారికి వాళ్లభాషే ముఖ్యం, అదే గొప్ప. అలాంటప్పుడు దాన్ని వదులుకోవాలని ఎవ రూ అనుకోరు. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఉధృత‌మవుతున్నాయి. కర్ణాటకలో నమ్మ మెట్రో బోర్డులను హిందీలో రాయడానికి వీల్లేదంటూ వాటిని పూర్తిగా తీయించేశారు. అసలు ఇక్కడ హిందీ అవసరం లేదని కూడా అన్నారు. ఎవరి భాష వారికి ముఖ్యమే అయినా, జాతీయ భాష, అంతర్జాతీయ భాషలు కూడా నేర్చుకుని ఉండటం కొంతవరకు అవసరం అవుతుంది. అవి వచ్చినవాళ్లు దేశ విదేశాల్లో ఎక్కడైనా వెళ్లి బతకగలరు. లేకపోతే కేవలం మన సొంత రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Show Full Article
Print Article
Next Story
More Stories