logo
జాతీయం

నేడు, రేపు పలు ప్రాంతాల్లో వందలాది పిడుగులు.. వాతావరణ శాఖ భారీ హెచ్చరిక!

నేడు, రేపు పలు ప్రాంతాల్లో వందలాది పిడుగులు.. వాతావరణ శాఖ భారీ హెచ్చరిక!
X
Highlights

నేడు రేపు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వందలాది పిడుగులు పడే అవకాశముంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

నేడు రేపు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వందలాది పిడుగులు పడే అవకాశముంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లో ఒంటరిగా , పొలాల్లో ఉండవద్దని తెలిపింది. విపరీతమైన ఎండలు, సౌర తుపాను, వాతావరణంలో వేగమైన మార్పుల కారణంగా భారీ ఎత్తున పిడుగులు పడుతున్నాయని తెలిపింది. కాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలకు నేడు రేపు సెలవు ప్రకటించారు హర్యానా రాష్ట్ర విద్యా శాఖా మంత్రి.

Next Story